మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ శనివారం విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7 గంటల పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అవినాశ్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వాట్సాప్ కాల్స్, రూ.4 కోట్ల ఫండింగ్పై ఆరా తీసినట్లు సమాచారం.