మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలకాపూర్ టౌన్ షిప్ రోడ్డు నంబర్ 13లో నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ, హనుమత్ సమేత దేవాలయంలో ఆదివారం నుంచి బుధవారం వరకు యంత్ర, విగ్రహ, ధ్వజస్తంభ, విమాన శిఖర ప్రతిష్టా పన పూజలను నిర్వహిస్తున్నట్టు టౌన్ షిప్ వాసులు తెలిపారు. దివంగత లక్ష్మీదేవి, సుబ్బారా యుడు జ్ఞాపకార్థం వారి కుమారుడు వడిశెట్టి నాగరాజు, శ్రీదేవి దంపతులు ఆలయాన్ని నిర్మించారని, హోమాలు, పూజలు కొనసాగుతాయని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.