HDFC బ్యాంకు తమ ఖాతాదారులకు షాకిచ్చింది. స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. MCLR ను 15 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణాలపై చెల్లింపులు మరింత అధికం కానున్నాయి. నెల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటు 8.10 నుంజి 8.20 శాతానికి, 3 నెలల లోన్లపై వడ్డీరేటు 8.40 నుండి 8.50 శాతానికి, 6 నెలల రుణాలపై వడ్డీ రేటు 8.80 నుండి 8.85 శాతానికి పెరిగినట్లు బ్యాంకు తెలిపింది.