తనతో పెళ్లికి ఒప్పుకోలేదని ఓ వ్యక్తి మైనర్ బాలికను దారుణంగా హతమార్చిన ఘటన పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. సోందల్పూర్ లో బ్రిజెన్ మండల్(45) అనే వ్యక్తి సోనాలి అనే బాలికను గతేడాది నుండి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు. దీన్ని బాలిక తిరస్కరించడంతో కక్ష పెంచుకున్నాడు. శనివారం ఉదయం ట్యూషన్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా పదునైన ఆయుధంతో ఆమె మెడ, నడుముపై పలుమార్లు పొడిచి హత్య చేశాడు.