ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థలో ఎవరో చొరబడడమే కారణమని ప్రాథమికంగా తేలిన నేపథ్యంలో రైల్వేబోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లు నడవడంలో కీలకంగా నిలిచే వ్యవస్థలపై రెండేసి తాళాలు వేసి భద్రంగా చూసుకోవాలని ఆదేశించింది. ఏ విభాగం తాళాలను ఎవరు తీశారు, ఎవరు వేశారనేవి పట్టికలో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ‘రిలే హట్’లు, పాయింట్/ట్రాక్ సర్క్యూట్ సిగ్నళ్ల వద్ద ఈ జాగ్రత్తలు పాటించాలి.