WTC ఫైనల్‌లో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 1, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ పేరిట ఉండేది. ఆయన తన టెస్టు కెరీర్‌లో 266 వికెట్లు తీశాడు. 268 వికెట్లతో ఆయన రికార్డును జడేజా అధిగమించాడు.