టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానానికి చేరుకున్నాడు. తన టెస్టు కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తం 70 సిక్స్‌లు కొట్టాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్స్‌లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. 78 సిక్స్‌లతో ధోని రెండవ స్థానంలో, 69 సిక్స్‌లతో సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో ఉన్నారు. సిక్స్‌ల విషయంలో సచిన్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిగమించాడు.