బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని ఉత్తరకోస్తా, రాయలసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.