నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలంలో ఓ పాస్టర్ దారుణానికి ఒడిగట్టాడు. చర్చికి వచ్చిన ఓ వివాహితపై కన్నేసిన అతడు.. ఇంట్లో పని ఉందని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే బాధితురాలు వెళ్లి భర్తకు చెప్పడంతో ఈనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పాస్టర్ ఓ నాయకుడిని ఆశ్రయించడంతో బాధితురాలికి రూ.40 వేలు ఇచ్చేలా ఒప్పందం చేశారు. ఆమె నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.