ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సభ ఈనెల 12వ తేదీన రోసూరులో జరగనుంది అందుకుగాను ముందస్తు చర్యగా క్రోసూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఆదివారం అందజేశారు. ముఖ్యమంత్రి సభ సందర్భంగా ఎటువంటి ప్రదర్శనలు చేయరాదని కాన్వాయి అడ్డుకోకూడదని నల్ల బెలూన్లు పైకి ఎగర వేయరాదని నోటీసులు అందించారు. ఇందుకు విరుద్ధంగా పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయన్నారు.