స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు కోరుచున్నట్లు డెవలప్మెంట్ మేనేజర్ ఎం. దిలీప్ రాజా ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెనాలి డివిజన్ పరిధిలోని ఎస్. బి. ఐ, లైఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సేల్స్ ఆఫీసర్ పార్ట్, ఫుల్ టైం ఉద్యోగాలకు నియామకాలు జరుగుతాయన్నారు. 25 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు లోపు వరకు వయస్సు గల అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగి ఉండాలన్నారు.
రిటైర్డ్, ప్రైవేటు ఉద్యోగులు, చిట్ఫండ్ ఏజెంట్స్, గృహిణులు, ఫైనాన్స్ సెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్స్, టాక్స్ కన్సల్టెంట్స్, బ్యూటీషియన్, డాక్టర్లు, టీచర్లు, వ్యాపారులు, వర్కింగ్ ఉమెన్స్, దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్. బి. ఐ లైఫ్ వారి ఏజెన్సీ నియామకాలలో ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ లో ప్రతి గ్రామానికి ఒక్కరి చొప్పున ఏజెంట్ నియామకాలు జరుగుతాయన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు మరిన్ని వివరాల కొరకు 8639066501 నెంబర్ ద్వారా సంప్రదించాలని దిలీప్ రాజా కోరారు.