గుంటూరు నగరం లోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో బదిలీకి అర్హులైన వారి సవరించిన జాబితాను వెల్లడిస్తూ. ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు యాస్మిన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ప్రకటించిన జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలతో సమాచారాన్ని వెల్లడించినట్లు ఆదేశాల్లో ఆమె పేర్కొన్నారు.