శావల్యాపురం మండలం వేల్పూరు పంచాయతీ పరిధి గంటావారిపాలెం ఎస్టీ కాలనీలో టైఫాయిడ్ రాకుండా ఉచితంగా టీకా వేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. వేల్పూరు జడ్పీ పాఠశాల వివేకానంద యూత్ స్టూడెంట్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సండ్రపాటి చలపతి రావు మాట్లాడుతూ. శిబిరం నిర్వహణకు గిన్నిస్ బుక్ లో నమోదైన మొగిలి సుభాష్ ఆర్థిక సహకారం అందించారన్నారు. రామ పరమేశ్వరరావు, గోపి, పులి సురేష్ తదితరులు పాల్గొన్నారు.