భూ అంతర్భాగంలో భారీ పర్వతాలు ఉన్నట్లు అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. మౌంట్ ఎవరెస్ట్ కన్నా భూమి లోపల ఉన్న పర్వతాలు మూడు, నాలుగు రెట్లు ఎత్తైనవని చెబుతున్నారు. భూమిపై మౌంట్ ఎవరెస్ట్ 8.8 కిలో మీటర్ల ఎత్తులో ఉండగా భూమి లోపల ఉన్న ఈ పర్వతాలు ఏకంగా 38 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని పేర్కొన్నారు. భూమి లోపల 2,900 కిలో మీటర్ల లోతులో ఈ పర్వతాలు ఉన్నట్లు తెలిపారు.