పెట్రోలు, డీజిల్ ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు స్థిరంగా ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అంశాన్ని చమురు కంపెనీలు పరిశీలించవచ్చని తెలిపారు. వచ్చే త్రైమాసికంలో ఈ కంపెనీలు మెరుగ్గా రాణిస్తే ధరల తగ్గింపు ఉండొచ్చన్నారు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మంత్రి ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.