ఈ నెల 11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన, బహిరంగ సభ సందర్బంగా నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సీపీ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లపై శనివారం చర్చించారు. లుగురు డిసిపీ లు, రెండు ఏ. పి. ఎస్. పి ప్లటూన్లు, 4 స్పెషల్ పార్టీలతో మొత్తంగా 950 సిబ్బంది, అధికారులతో కేంద్ర హోం మంత్రి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించే ప్రాంతాలైన ఐ. ఎన్. ఎస్ డేగ, ఎయిర్పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయు పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్వెక్షన్ సెంటర్ తో పాటూ ఆయన పర్యటించే ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టామన్నారు.
రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వద్ద వున్న రైల్ వే ఫుట్ బాల్ గ్రౌండ్స్ ఆరోజు సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు బందోబస్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 11వ తేదీ మధ్యా్‌హ్నం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు.