తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై శనివారం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నరసింహారాజు, పర్యవేక్షకులు కనకరాజు, ధర్మకర్త మండలి సభ్యురాలు రాజేశ్వరి అర్చక పరివారంతో కలిసి గవర్నర్ కి స్వాగతం పకారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న గవర్నర్ మనసులోని కోర్కెలను స్వామివారికి నివేదించుకున్నారు. స్వామివారి ఆరాధన సేవలో పాల్గొన్న గవర్నర్ ప్రసాదాలను స్వీకరించారు. ఈమెతో పాటు రాజ్ భవన్ ఎడిసి అక్షoస్య యాదవ్, ఆర్డీవో భాస్కర్ రెడ్డి, పెదగంట్యాడ తాసిల్దార్ రమాదేవి, చిన్న వదిలి ఆర్ ఐ మల్లేశ్వరరావు, గోపాలపట్నం సిఐ, ఎస్ఐలు ఉన్నారు.