అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న బీచ్‌రోడ్డులో యోగా క్యాంపు నిర్వహించనున్నట్టు తూర్పు నావికాదళం శనివారం ఓ ప్రకటనలో తెలియజేసింది. సోమవారం ఉదయం 6నుంచి 7గంటల వరకు ఇక్కడి కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద క్యాంపు ఉంటుందని అధికారులు తెలిపారు. శారీరక ధృడత్వాన్ని పెంపొందించేదిగా, ఆరోగ్యాన్ని పెంచేది యోగాయేనని సూచించారు. నేవీ సిబ్బంది కూడా యోగాసనాలు, వజ్రాసనాలు, సూర్యనమస్కారాలు, శవాసనాలు, సుఖాసనాలు సాధన చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పౌరులెవరైనా భాగస్వాములు కావచ్చని సూచించారు.