భావితరాల విద్యా విధానాల కోసం వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిష్టాతులు, నిపుణులు, ఉన్నతాధికారులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కానుంది. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అమలుకు.. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కానుంది. ఈ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ.. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్‌గా ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్వీనర్‌గా కమిషనర్ ఉండనున్నారు. వీరే కాకుండా సభ్యులుగా అశుతోష్ చద (మైక్రో సాప్ట్ ఇండియా), శాలిని కపూర్ (అమెజాన్ వెబ్ సిరీస్), శ్వేతా కరుణ (ఇంటెల్ ఆసియా) ఉండనున్నారు. గూగుల్, నాస్కామ్ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. వీరంతా.. కలిసి భావితరాల విద్యా విధానాలను రూపొందించి.. ప్రభుత్వానికి అందజేస్తారని తెలుస్తోంది.