వైసీపీ అరాచక పాలన వల్ల ఏపీకి పెట్టుబడులు రావడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి అన్నారు. కొద్ది రోజులుగా వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ నుంచి పారిపోతున్నారని వెల్లడించారు. రాష్ట్రాన్ని ఎవరు అప్పులపాలు చేశారో సీఎం జగన్ చెప్పాలన్నారు. కేంద్రం ఏపీకి 25 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, ఎంత మందికి ఇళ్లు మంజూరు చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.