బ్రిటన్‌లో ఈ ఏడాది ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ట్రూపింగ్ ది కలర్ పరేడ్ కోసం రిహార్సిల్స్ చేస్తుండగా.. ముగ్గురు సైనికులు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రిన్స్ విలియం ముందు చివరి రిహార్సల్ సందర్భంగా శనివారం ముగ్గురు సైనికులు మూర్ఛపోయినట్టు స్థానిక మీడియా పేర్కొంది. లండన్‌లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరడంతో సైనికులు ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించి పరేడ్‌లో పాల్గొన్నారు. ‘ఈ ఉదయం కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడికి కృతజ్ఞతలు.. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ మీరందరూ చాలా బాగా పనిచేశారు.. ముఖ్యంగా నేటి వాతావరణ పరిస్థితుల్లోనూ కృషి, ప్రిపరేషన్‌తో పాల్గొన్న వారందరిదీ ఘనత’ అని పేర్కొన్నారు.
రిహార్సిల్స్‌లో పాల్గొన్న సైనికుడు స్పృహతప్పి పడిపోయి.. తిరిగి లేచి కొనసాగించే ప్రయత్నం చేశాడు. కొద్దిసేపటి తర్వాత వైద్యులు అక్కడకు చేరుకుని, చికిత్స నిర్వహించారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ దక్షిణ ఇంగ్లండ్‌కు వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. బ్రిటన్ చక్రవర్తి అధికారిక పుట్టినరోజు సందర్శంగా ఏటా జూన్‌లో ట్రూపింగ్ ది కలర్ పేరిట రిహార్సల్ నిర్వహిస్తారు. జూన్ 17న జరిగే వేడుకను కింగ్ చార్లెస్-3 పర్యవేక్షిస్తారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్రిటిష్ ఆర్మీ రెజిమెంట్‌ల నిర్వహించే ఈ వేడుక.. కామన్వెల్త్‌లోని ఇతర దేశాలలో జరుగుతాయి. ట్రూపింగ్ ది కలర్ 17వ శతాబ్దం నుంచి బ్రిటీష్ పదాతిదళ రెజిమెంట్‌ల సంప్రదాయంగా దీనిని నిర్వహిస్తుంటాయి. హౌస్‌హోల్డ్ డివిజన్‌లోని ఐదు ఫుట్ గార్డ్స్ రెజిమెంట్‌లలో ఒకటి గార్డుల ర్యాంక్‌ల ఆధారంగా దీనికి ఎంపిక చేస్తుంది. ఒకప్పుడు వీటిని యుద్ధభూమిలో ర్యాలీగా ఉపయోగించేవారు. వేడుక సందర్భంగా బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి హార్స్ గార్డ్స్ పరేడ్ వరకు అశ్వికదళంతో చక్రవర్తి ఊరేగింపుగా వెళ్తారు. వారి నుంచి గౌరవందనం స్వీకరించిన తర్వాత హౌస్‌హోల్డ్ డివిజన్, కింగ్స్ ట్రూప్, రాయల్ హార్స్ ఆర్టిలరీని తనిఖీ చేస్తారు.