విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ఆదివారం దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. కాగా గతంలో ఇచ్చిన హామీ మేరకు దేవాంగ విద్యార్థుల ఉన్నత విద్య కోసం రూ. 20లక్షల మొత్తాన్ని సంక్షేమ సంఘం నాయకులకు ఎమ్మెల్యే అందజేశారు. ఎంఈఓ సావిత్రమ్మ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. అనతరం 10వ తరగతి, ఇంటర్లో అన్ని గ్రూపుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు 45 మందికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీదేవి, దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుట్టి నాగశయనం, సంఘం గౌరవ సలహాదారులు వుట్టి వీరయ్య, సందు శివనారాయణ, కళ్యాణ మండప అధ్యక్షుడు దేవరశెట్టి ఆదినారాయణ, కౌన్సిలర్లు పిట్టా బాలాజీ, పోసా వరలక్ష్మి, సంఘం కార్యదర్శి గిద్దలూరు ఈశ్వరయ్య, కోశాధికారి కాటం రామకృష్ణ, వుట్టి సోమశేఖర్, బత్తల శ్రీనివాసులు పాల్గొన్నారు.