ప్రొద్దుటూరు స్థానిక పుట్టపర్తి నారాయణాచార్యుల ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో ఆదివారం సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలను నిర్వహించారు. ముందుగా గ్రంథాలయాల స్థాపనకు కృషి చేసిన అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పుట్టపర్తి నారాయణాచార్యుల ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాల యం, రామేశ్వరంలోని బాలబాలికల గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి బహుమతులు అందించారు. వేసవి శిక్షణ శిబిరంలో బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎంఈఓ సావిత్రమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆర్టీపీపీ డీఈ ప్రభాకర్ రెడ్డి అల్పాహారం పంపిణీ చేశారు. గ్రంథాలయ అధికారిణి తిరుపతమ్మ, గ్రంధాలయ రికార్డ్ అసిస్టెంట్ ఇబ్రాం సాహెబ్, ఎర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ త్రివిక్రమ్ రెడ్డి, రచయిత జింకా సుబ్రమణ్యం, ఉపాధ్యాయులు, రచయితలు డీకే చదువుల బాబు, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, రిటైర్డు హిందీ పండిట్ బికారి సాహెబ్, గంగాధర్ రెడ్డి, పాల్గొన్నారు.