ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎ్‌స)లో ఆదివారం 5వ దశ 8వ యూనిట్‌లో (800 మెగావాట్లు) వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్‌కో చైర్మన్ కె.విజయానంద్, ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు.. బొగ్గును ఫైర్ చేసి ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. తొలిరోజు 300మెగావాట్ల లోడుతో వాణిజ్య ఉత్పత్తిని గ్రిడ్‌కు పంపించారు. జూలై వరకు ఉత్పత్తిని కొనసాగించి జూలై చివరి వారానికి పూర్తి సామర్థ్యంతో 800మెగావాట్ల ఉత్పత్తిని సాధిస్తామని అధికారులు వెల్లడించారు. వాణిజ్య ఉత్పత్తిని గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఎన్టీటీపీఎస్ మరో మైలురాయిని చేరుకుందని వారు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీజీఆర్‌ను అభినందించారు.