పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ యువమోర్చా సోషల్ మీడియా ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న నిశాంత్ గార్గ్ దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని మీరట్ పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ క్రమంలో అతడి శరీరంపై బుల్లెట్ గాయాలు కనిపించాయి. నిశాంత్ గార్గ్ భార్య సోనియాపై మృతుడి తమ్ముడు గౌరవ్ అనుమానం వ్యక్తం చేశాడు.ఈ క్రమంలో సోనియాను అరెస్ట్ చేసి విచారించగా.. నిశాంత్ తనను తానే తుపాకీతో కాల్చుకునే ప్రయత్నం చేశాడని, అప్పుడు తుపాకీ తూటా ఆయన శరీరంలోకి వెళ్లినట్లు తెలిపారు. కోర్టులో ఆమెను ప్రవేశపెట్టగా జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు.