పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మరోసారి ఊరట లభించింది. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ముంబై హైకోర్టు పొడిగించింది. ఆగస్టు 2 వరకు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపు.2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీకి చెందిన మహేశ్ 2021లో పరువు నష్టం కేసు పిటిషన్ చేశారు.