డబుల్ ఛార్జీపై ప్రశ్నించిన ఓ ప్రయాణికుడిని ఆటో డ్రైవర్ అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బెంగళూరులోని యశ్వంతపుర్ సోప్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన అహ్మద్, ఆయూబ్ జీవనోపాధి కోసం బెంగళూరుకు వచ్చి యుశ్వంతపూర్లో నివసిస్తున్నారు. పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరడానికి ఆటో మాట్లాడారు. ఆటో డ్రైవర్ డబుల్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎందుకని ప్రశ్నించిన అన్నదమ్ములపై ఆటో డ్రైవర్ అశ్వత్థ దాడి చేశారు. అహ్మద్ అక్కడికక్కేడ మృతి చెందగా.. ఆయూబ్కు గాయాలయ్యాయి.