ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో తెర వెనుక ఉన్న నాయకులు ఎవరని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి జయలలితలను అరెస్ట్ చేసిన సీబీఐ.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌కు తీవ్ర జాప్యం చేసిందని, ఆయన వెనుకున్న నాయకులు ఎవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలను అడ్డంగా మోసం చేసి సీఎం అయ్యాడన్నారు. రానున్న ఎన్నికల్లో గెలమని తెలిసిపోయిన తర్వా త పది లక్షల మంది టీడీపీ మద్ద తుదారుల ఓట్లను తీయించారని ఆరో పించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని, లేకపోతే వెంటనే ఆర్‌డీవోకు ఫిర్యాదు చేయాలని సూచించారు.