టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమలో మంగళవారం పూర్తి కానుంది. జగన్ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై ప్రజల కష్టాలుతెలుసుకునేందుకు జనవరి 27న కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం, పోలీసులు కల్పించిన అడ్డంకులను అధిగమించి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 108 మండలాలు, 943 గ్రామాల గుండా నడిచారు బుధవారంతో 125 రోజులవుతాయి. 3 కిలోమీటర్లు మాత్రమే నడుస్తారు. అంటే 1,587 కిలోమీటర్లు నడచినట్లవుతుంది. సాయంత్రం 5.10 గంటలకు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లెలో అడుగుపెట్టడంతో రాయలసీమలో ఆయన పాదయాత్ర ముగుస్తుంది.