యువతకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని కడప జిల్లా, మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు డి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో నారమా కులపల్లె తాండాకు చెందిన 15 మంది టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దొమ్మలపాటి మాట్లాడుతూ చంద్ర బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు భృతి, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. శంకర్‌నాయక్, హరి, మల్లేష్, కిరణ్, సంతోష్, హరికృష్ణ గంగప్ప తదితరులు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు యశశ్విరాజ్, మున్నానాయక్, పి.శ్రీనివాసులు, చల్లా నరసింహులు, సుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.