కుప్పం నియోజకవర్గ జర్నలిస్టు పిల్లలకు కుప్పం పబ్లిక్ స్కూల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని మంగళవారం కుప్పం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ప్రశాంత్, సెక్రటరీ రోహిత్ తేజకీరణ్, మురళి, శివ బిసిఎన్ విద్యా సంస్థల ఛైర్మన్ బిసీ నాగరాజు, సునిల్ రాజ్ , సాగర్ రాజ్ కోరారు. జర్నలిస్ట్ పిల్లలకు 50 శాతం రాయితీ ఇవ్వడానికి కుప్పం పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అంగీకరించినందుకు కుప్పం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ అవకాశాన్ని కుప్పం నియోజకవర్గ జర్నలిస్ట్ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.