నిష్పక్షపాత పాలనతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అయిందని., ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రధాన కారణం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ సచివాలయం పరిధిలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గడిచిన 75 ఏళ్లలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూసి ఉండం. ఎన్నికలు అయిన తరువాత ప్రజల మధ్య తిరుగాడుతూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, నాటి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ కు దక్కింది అని తెలియజేసారు.