బలవంతంగా తనకు తాళి కట్టిన రెండో భర్తకు ఓ మహిళ రాఖీ కట్టింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జోధ్‌పూర్‌కు చెందిన తరుణ శర్మ అనే యువతి.. తన స్నేహితుడు సురేంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి యువతి కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. దాంతో వారికి పెళ్లయిన పది రోజులకే వేరు చేశారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని అంతఘర్ పట్టణానికి చెందిన జితేంద్ర జోషితో బలవంతంగా రెండో వివాహం చేశారు. దీంతో ఆ యువతి పైళ్లయిన వెంటనే భర్త చేతికి రాఖీ కట్టింది. తనకు ముందే వివాహం జరిగిందని రెండో భర్త కుటుంబానికి తెలియడంతో ఆ యువతికి సపోర్ట్ గా నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa