ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ 23 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 15, 2023, 10:25 AM

రాష్ట్రంలో ఈనెల 23 నుంచి నెలరోజుల పాటు జనగన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుసంధానంగా ‘సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టాలని బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈకార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ గ్రామ వలంటీర్‌, సచివాలయం సిబ్బంది, గృహసారధులు, ప్రజాప్రతినిధులు వెళ్లి సమస్యలు ఆరా తీయాలని సూచించారు. గతంలో దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను వారికి స్వయంగా చెప్పాలని అన్నారు. ఒక ఊళ్లో ఒక రోజంతా గడిపి ప్రజలకవసరమైన పత్రాలను అప్పటికప్పుడే ఇవ్వాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa