దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ రెసిడెన్సియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖమంత్రి అర్జున్ ముండా వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో కేంద్రం 38,800 ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బందిని భర్తీ చేయనుందని చెప్పారు. ఆదివాసీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 1997-98లో ఏకలవ్య పాఠశాలల పథకం తీసుకొచ్చిందని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే క్రమంలోనే పోస్టుల భర్తీకై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నటు్ల చెప్పారు. పోస్టుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.