భారత సంపన్నులు విదేశాలకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది 6,500 మంది సంపన్నులు భారత్‌ను వీడే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది. సంపన్నుల వలసల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని న్యూ వరల్డ్ వెల్త్ రీసెర్చ్ విభాగం హెడ్ ఆండ్రూ మోలిస్ అన్నారు. విదేశాలకు వెళ్లిపోతున్న సంపన్నుల కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త మిలినీయర్లు భారత్‌లో పుట్టకొస్తున్నారన్నారు. సంపన్నులు అధికంగా దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్తున్నారని ఆయన చెప్పారు.