తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థకి తలుపులు మూసేసింది. ఇక నుండి ఈ రాష్ట్రంలో ఏ కేసునైనా దర్యాఫ్తు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. గతంలో తెలంగాణ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నాయి.తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం విధితమే. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సీబీఐకి తలుపులు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.