బండిఆత్మకూరు మండలం జీసీ పాలెం పరిధిలోని తెలుగుగంగ సమీపంలోని పొలాల్లో మేతకు వెళ్లిన బర్రెల మందపై బుధవారం పెద్దపులి దాడి చేసింది. ఓ బర్రె మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పాడి రైతులు తెలుగుగంగ వెంట ఉన్న పంట పొలాల ప్రాంతంలో బర్రెలను మేపేందుకు వెళ్లగా మందపై పెద్దపులి దాడి చేసినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa