ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో లవ్ జిహాద్ కారణంగా తీవ్రఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో లవ్ జిహాద్ ఎక్కువైందని భావించిన పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా లవ్ జిహాద్ కు పాల్పడితే వారిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు అధికారులు పురోలాలో సెక్షన్ 144 విధించారు. అలాగే చట్టాన్ని భంగపరచడానికి ఎవరినీ అనుమతించబోమని డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్డర్ మహాపంచాయతీని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.