డబ్ల్యూఎఫ్ఐ ఛీఫ్ రెజ్లర్లను లైంగికంగా వేదించారని మహిళా రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర క్రీడా మంత్రి రెజ్లర్లతో చర్చించి రెజ్లర్ల డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా జూన్ 15లోపు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరారు. కాగా క్రీడామంత్రితో గత వారం ఒక సమావేశంలో రెజ్లర్లు నాలుగు డిమాండ్లను ఉంచారు.ఈ నేపథ్యంలోనే జూన్ 15 కావడంతో రెజ్లర్ల డిమాండ్ మేరకు డబ్ల్యూఎఫ్ఐ ఛీఫ్ పై మొట్టమొదటి చార్జీషీట్ దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.