అరటిపండు టీని ఎప్పుడైనా తాగారా?. ఒకవేళ తాగకపోతే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది తాగినప్పుడు రిలాక్స్ అయిన ఫీల్ కలుగుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బనానా టీని ఎలా తయారు చేస్తారో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.. బనానాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసి మరిగించుకోవాలి. 10 నిమిషాలు బాగా మరిగించిన తర్వాత ఆ నీటిని తాగాలి. ఇందులో ఎలాంటి పదార్థాలు వేయరాదు. న్యాచురల్ స్వీట్తోపాటు ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. నిద్రపోయే ముందు బనానా టీ తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.