గుడ్లు తినటం ఆరోగ్యానికి మాత్రమే కాక చర్మ సౌందర్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. రోజూ ఆహారంలో గుడ్డు తీసుకుంటే మంచిది. ఇది చర్మాన్ని సంరక్షించి, ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని దరిచేరనివ్వవు. చేపలు, మాంసం ఆహారంలో తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. రోజూ పండ్లు తినటం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మంచిది. ఎక్కువగా నీటిని తాగడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అలాగే టైమ్‌కి పడుకోవాలి.