తమిళనాడు నుంచి ఈసారి ఎలాగైనా తమ ప్రతినిధులు పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. మదురై నుంచి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కోయంబత్తూరు నుంచి ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ను పోటీలో నిలబెట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు నుంచి పోటీ చేస్తారా అనే చర్చ ఊపందుకుంది.