ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 15, 2023, 01:30 PM

వివిధ తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రంలో హింసాకాండ నెలకొంది. ఇటీవల కాంగ్‌పోప్కి జిల్లా సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పులు జరుపగా.. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మణిపూర్‌లోనే ఏకైక మహిళా మంత్రి అయిన నిమ్చా కిపిజెన్ అధికారిక నివాసంపై ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com