లండన్లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ యొక్క లండన్ విభాగానికి నేతృత్వం వహించిన ఆర్కెస్ట్రేటర్ అవతార్ సింగ్ ఖండా మరణించారు. అతని మరణానికి ప్రధాన కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా అవతార్ సింగ్ మార్చి 19న లండన్లోని భారత హైకమిషన్ వద్ద జరిగిన హింసాకాండకు నేతృత్వం వహించాడు. అలాగే హైకమిషన్ వద్ద భారత త్రివర్ణ పతాకాన్ని తీసివేసిన ఖాండా ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచాడు.