ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. మిండోరో ద్వీపంలో భూమి కంపించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ గురువారం ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైనట్లు వెల్లడించింది. మనీలా పట్టణానికి 124 కిలో మీటర్ల దూరంలో భూమికి 10 కి.మీల లోతులో భూకంపం కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఈ భూకంపం వల్ల సంభవించిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై వివరాలు తెలియాల్సి ఉందన్నారు.