విశాఖ నగరంలో గురువారం కిడ్నాప్ కలకలం రేగింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ప్రముఖ ఆడిటర్, స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ జీవీ కిడ్నాప్‌కు గురయ్యారు. ఓ రౌడీ షీటర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. అయితే అలర్ట్ అయిన పోలీసులు కిడ్నాప్‌ను ఛేదించారు. ఈ మేరకు స్వయంగా విశాఖ నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ మీడియా వివరాలు అందించారు. కిడ్నాప్‌కు గురైన వారంతా క్షేమంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిందితులను కూడా అరెస్టు చేశామని చెప్పారు.