ఓ వివాహితుడు భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన ఘటన గురువారం కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో భార్యాభర్తలైన సాలే శాంతి, చంటి నివాసం ఉంటున్నారు. వీరు హనుమాన్ జంక్షన్ లో హోటల్ ను నిర్వహించి వదిలేసి కంకిపాడు వచ్చేశారు. అద్దె విషయంపై మాట్లాడాలని భార్య శాంతి జంక్షన్ వెళ్లింది. కానీ భర్త చంటికి అనుమానం వచ్చి ఆరా తీయడంతో శాంతి జంక్షన్ వెళ్ళలేదని నిర్థారించుకన్నాడు. ఇంటికొచ్చిన భార్యను నిలదీయటంతో వాగ్వివాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈక్రమంలో అనూహ్యంగా భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. పొట్ట భాగంలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.