సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. వెంకటాచలంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం చుక్కల భూముల సమస్యల నుంచి విముక్తి పొందిన రైతులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 23,023 మంది రైతులకు సంబంధించి 43,270 ఎకరాల భూములను, సర్వేపల్లి నియోజకవర్గంలో 2,587 మంది రైతులకు చెందిన 3,756 ఎకరాల భూములను 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీ కోదండరామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.