జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పులు చూపించారు. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని.. నారాహి యాత్ర ని విమర్శించారు. పదేళ్లుగా పవన్ పార్టీని నడుపుతున్నది చంద్రబాబేనని ఆరోపించారు. పవన్ కల్యాణ్ సినిమాలను ఏపీ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శలు చేస్తున్నారని, ఏ సినిమాను ఆపామో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. సినిమాలు బాగా తీయక పోతే ఎందుకు ఆడతాయని ప్రశ్నించారు. ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో సీట్లు వస్తాయని, వ్యూహాలను నమ్ముకుంటే శాసనసభకు కూడా రాలేరని అన్నారు. సీఎం పదవి ఏమైనా దానమా?.. ఎవరైనా ఇస్తే తీసుకోడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఇంత దిగజారడం అవసరమా? అని పేర్ని నాని ప్రశ్నించారు.